Sunday, 26 April 2026 04:01:38 PM

పుట్టపర్తి సాయి ఆరామంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో సమీక్ష సమావేశం

పుట్టపర్తి

Date : 15 May 2023 09:25 PM Views : 159

One Tv News - NEWS / శ్రీసత్యసాయి జిల్లా : దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటి.. ఇంకా మాదిగ జాతిని అగ్రవర్ణ కులాలు అణగదొక్కుతూ ఉన్నాయని. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వివక్షత రూపుతున్నారని, ఈసారి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో సమన్యాయం కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో ఎమ్మార్పీఎస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ఏపీ ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షునిగా సి.రామాంజినప్ప ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో కుంటిమద్ది ఓబులేసు మాట్లాడుతూ మాదిగల రాజకీయ చైతన్య యాత్ర సింగనమల నియోజవర్గం నుండి శుక్రవారం యాత్ర ప్రారంభమైందనీ వారు పేర్కొన్నారు.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం మాదిగలకే ప్రాధాన్యత కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో మా సత్తా ఏమిటో దేతడామని హెచ్చరించారు. బీసీ వర్గానికి చెందిన టిడిపి నాయకులు కాల్వ శ్రీనివాసులు కూడా మాదిగ జాతికి చెందిన బండారు శ్రావణిని అణగతోక్కుతున్నారన్నారు. ఇదిలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటు బదని హెచ్చరించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :