One Tv News - NEWS / నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ మైదానంలో ఆదివారం భూమా ప్రీమియర్ లీగ్ రాయలసీమ స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి ఈ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అన్ని జిల్లాల నుండి పోటీలకు హాజరైన క్రీడాకారులకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 50000, మూడో బహుమతిగా 25 వేల రూపాయలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.మొత్తం 50 క్రీకెట్ టీమ్స్ ఇందులో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ క్రికెట్ పోటీల సందర్భంగా క్రీడాకారులకు వసతి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
One Tv News