One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న పఠనోర్సవం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశామని అన్ని పాఠశాలలకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
One Tv News