Sunday, 26 April 2026 04:01:35 PM

చిరుధాన్యాల సంవత్సరం

కర్నూలు

Date : 19 May 2023 09:24 AM Views : 173

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కలెక్టరేట్ లోని డ్వాక్రా బజార్ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటు చేసిన మిల్లెట్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు.* ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాల వాడకం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈరోజు చిరుధాన్యాల వంటకాలను ప్రోత్సహిస్తూ వాటి నుండి ఎటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు అనే అంశాన్ని స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన అందరి జీవన విధానాలు మారాయి గతంలో మన పెద్దవాళ్లు చేస్తున్నటువంటి శారీరక శ్రమ ఈ కాలం వారు చేయడం లేదని అందుకే చిన్న వయస్సులోనే డయాబెటిస్, బిపి వంటి రోగాలు వస్తున్నాయని అందుకొరకే మన జీవనశైలితో పాటు ఆహార శైలిలో కూడా మార్పు తీసుకొని రావడానికి చిరుధాన్యాలు మన జీవన శైలిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అందుకొరకు అన్నంతో పాటు చిరుధాన్యాలు కూడా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని అందరం తెలుసుకోవాలని అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వారు కూడా చిరుధాన్యాలు తినే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలని మన జిల్లా ఎప్పటినుండో చిరుధాన్యాల సాగులో, ఉపయోగించడంలో ముందుంది కాబట్టి దాన్ని మరింత అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజల్లోకి చిరుధాన్యాల యొక్క ఉపయోగాన్ని తీసుకొని వెళ్ళాలన్నారు. కేవలం కర్నూలు ప్రాంతానికే పరిమితం కాకుండా చిరుధాన్యాల ఉత్పత్తులను, చిరుధాన్యాలు పండించే రైతులను మరింత ప్రోత్సహించి ఏరియా విస్తీర్ణంతో పాటు మార్కెటింగ్ లో కూడా డెవలప్ చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ సీజన్లో కొంత ఏరియా వరకు మిల్లెట్ సాగు కొరకు ప్రణాళిక రూపొందించామని వాటిపైన వ్యవసాయ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కొంతమంది ప్రజలకు మిల్లెట్స్ ఎలా ఉపయోగించాలి వాటితో వంట ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి మిల్లెట్ కి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి వాటిని అమ్మే విధంగా చర్యలు తీసుకుంటే అటు ఎస్ హెచ్ జి మహిళలకు చేయూతని ఇవ్వడంతో పాటు మిల్లెట్స్ ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని కలెక్టర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కార్యాలయాలలో జరిగే సమావేశాలలో కూడా స్నాక్స్ అందించే సమయంలో మిల్లెట్స్ ఏర్పాటు చేసే విధంగా ప్రతి ఒక్క అధికారి చర్యలు తీసుకోవాలన్నారు.

ఆ విధంగా చేయడం వల్ల మెల్లమెల్లగా మార్పు వచ్చి మిల్లెట్స్ మన జీవన శైలిలో ఒక భాగంగా అవుతాయన్నారు. . మనల్ని చూసి ప్రైవేట్ కంపెనీలతో పాటు ఫంక్షన్స్ లో కూడా మిల్లెట్స్ ఏర్పాటు చేస్తారన్నారు. ప్రజలకు చిరుధాన్యాలు వాడమని చెబుతున్నాం కాబట్టి ముందు మనం మొదలుపెట్టి వారికి చెప్పాలని అందులో భాగంగానే కలెక్టరేట్ ఆవరణంలో మిల్లెట్ కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని అందులో మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్, మిల్లెట్ లంచ్, స్నాక్స్ ఏర్పాటు చేసి ప్రజలకు త్వరలో అందుబాటులో తీసుకొని వస్తామని అన్నారు.దీని ద్వారా ఎస్ హెచ్ జి గ్రూపులకు ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయడమే కాకుండా మార్కెటింగ్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిఆర్డిఏ పిడి, మెప్మా పిడి ని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా మిల్లెట్స్ ను ప్లాస్టిక్ బాక్స్ లో కాకుండా ప్రత్యామ్నాయ ప్యాకేజ్ చేయించాలన్నారు.. ఎందుకంటే ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డిఆర్డిఏ పిడి, మెప్మా పిడి అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి మిల్లెెట్ల ఏరియా విస్తీర్ణం పెంచడంతో పాటు వాటి యొక్క మార్కెటింగ్ ను కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :