One Tv News - NEWS / నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని జనరల్ సర్జన్ డాక్టర్ షేక్ షబ్నం తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 28న తాను ఆళ్లగడ్డలో జనరల్ సర్జన్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని ఇప్పటివరకు నాలుగు శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. పూర్తి క్రిటికల్ కండిషన్ కేసులు మాత్రమే నంద్యాల, కర్నూలు ఆసుపత్రులకు రెఫర్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.అలాంటి కేసులు మినహా మిగతా అన్ని సర్జరీలు ఈ ఆస్పత్రిలోనే పూర్తి చేసేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ కూడా ఉందని డాక్టర్ షబ్నం తెలిపారు. కాలిన గాయాలు, హైడ్రో సెల్,గడ్డలు, మొలలు,ఫైల్స్ ,ఫిస్టులా ఫిషర్స్ లాంటి సర్జరీలను ఈ ఆస్పత్రిలోనే చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షబ్నం వివరించారు. పీడియాట్రిక్ విభాగం వైద్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు సంబంధించి అన్ని సదుపాయాలు పురిటి పిల్లల కోసం ఇంక్యు బేటర్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు.
ప్రస్తుత సీజన్లో వేసవి ఎండల తీవ్రతా అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ కిషోర్ రెడ్డి వివరించారు.జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, తమ విభాగానికి సంబంధించి ఈ హాస్పిటల్ లో నిత్యం 100 వరకు ఓపీ లను పరిశీలించి తగిన చికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు.
One Tv News