One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా పోరుమామిళ్ల మండలం. రంగసముద్రం గ్రామ పంచాయతీ లోని రెండవ సచివాలయం పరిధిలో ని గుర్రప్పగారిపల్లె గ్రామంలో 104 వైద్యాధికారి.తలారి శ్రీ విద్య ఆధ్వర్యంలోఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి. తలారి శ్రీవిద్య. ఎంఎల్ హెచ్ పి.ప్రియాంక. అబ్జర్వర్ స్వామి రంగయ్య. ఏఎన్ఎం అన్నపూర్ణమ్మ. డీఈఓ విష్ణువర్ధన్. ఆశ కార్యకర్త విజయ. సూర్య లు పాల్గొన్నారు. ఈ వైద్య సేవలో వైద్య అధికారి తలారి శ్రీవిద్య వచ్చిన ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా వైద్య అధికారి శ్రీవిద్య మీడియాతో మాట్లాడుతూగ్రామాలలో ప్రజలకు చేరువగా ఫ్యామిలీ ఫిజిసియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా గర్భ వతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు షుగర్, బీపి వ్యాధి గ్రస్థులకు, చిరువ్యాధులకు 104వాహనము ద్వారా వైద్యం అందించడం చాలా మంచి పరిణామని ఆమె వివరించారు.
గర్భిణీ స్త్రీలకురక్త హీనత లేకుండా తీసుకో వలసిన పౌష్టిక ఆహారమును గురించి ఆరోగ్య విద్య ద్వారాతెలియపరుస్తున్నామని ఆమె అన్నారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త లు పాటించాలని అదేవిధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆమె కోరారు
One Tv News