Sunday, 26 April 2026 02:39:17 PM

పమిడిముక్కల సర్కిల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ జాషువాతో కలిసి డిఐజి అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ

ఏలూరు

Date : 18 July 2023 08:24 PM Views : 351

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు రేంజ్ పరిధిలోని 6జిల్లాల్లో గంజాయి సంపూర్ణ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి విక్రయించిన, రవాణా చేసిన కట్టిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల, తోట్లవల్లూరు మరియు పమిడిముక్కల సర్కిల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ జాషువాతో కలిసి డిఐజి అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించిన డిఐజి, రికార్డులను తనిఖీ చేశారు.

త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటుందని, సామరస్యమైన కేసుల్లో సచివాలయ మహిళా పోలీసులను భాగస్వామ్యం చేస్తున్నట్లు డీఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఏలూరు రేంజ్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్స్ నివారణకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డిఐజి తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :