Sunday, 26 April 2026 04:03:55 PM

ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2k రన్ విజయవంతం

కర్నూలు

Date : 21 June 2023 07:56 AM Views : 188

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా నుండి ఒలంపిక్స్ కు క్రీడాకారులను తీసుకపోవడమే ధ్యేయమని వన్ టివి న్యూస్, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర దినపత్రిక, సోలార్ కింగ్ అధినేత షేక్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఒలంపిక్ డే రన్ 2023 పురస్కరించుకుని ఎస్ ఎం బి ఫౌండేషన్ సహకారంతో కర్నూల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కర్నూలు కలెక్టరేట్ నుండి కొండారెడ్డి బురుజు వరకు 2కే రన్, భారీ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బుజ్జి వద్ద పలువురు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒలంపిక్ డే రన్ 2023 కార్యక్రమం కర్నూలు జిల్లా నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ ఎన్ బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టూ కే రన్ అట్టహాసంగా ప్రారంభించారు. టూకే రన్ కార్యక్రమానికి జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించగా ముఖ్యఅతిథిగా ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సోలార్ కింగ్ అధినేత షేక్ మహబూబ్ బాషా ఏపీ ఎస్పీ రెండవ పటాల డిఎస్పి మహబూబ్ బాషా లు ముఖ్య అతిధులుగా హాజరై ఒలంపిక్ క్రీడాజ్యోతి ని వెలిగించి టూ కే రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ర్యాలీ ఉత్కంఠంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లో షేక్ మహబూబ్ బాషా వెంట పలు విభాగాల క్రీడా సంఘాల నాయకులు క్రీడాకారులు రెండవ పటాలం 100కు పైగా పోలీసులు, పుల్లయ్య ఇంజనీరింగ్, అశోక ఇంజనీరింగ్, కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్, కె.వి.ఆర్ డిగ్రీ, ఇంటర్, బి క్యాంప్ ప్రభుత్వ ఇంటర్, మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు వెయ్యి మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ ఒలంపిక్ డే సందర్భంగా నిర్వహించిన టూ కే రన్ కు కర్నూల్ నగరంలోని క్రీడాకారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు సైతం హాజరయ్యారై ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన 2కే రన్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మీదుగా ధర్నా చౌక్ రాజ్ విహార్ కిడ్స్ వరల్డ్ పాత కంట్రోల్ రూమ్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు సాగింది. విద్యార్థులు, క్రీడాకారులు నిర్వహించిన టు కే రన్ పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా సైతం క్రీడాకారులతోపాటు ఈ విభాగంలో పాల్గొనడం పలువురు ప్రశంసలను అందుకున్నారు. ఈ పరుగు పందెంలో మహిళా విభాగంలోని వారికి ఐదు మందికి పురుషుల విభాగంలో ఐదు మందికి నగదు పురస్కారాలు తో పాటు షీల్డ్లు మెమెంటోలు అందించి సత్కరించారు. ర్యాలీలో పాల్గొన్న క్రీడాకారులకు క్రీడా సంఘం నాయకులకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా వన్ టీవీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచినీరు, స్నాక్స్ ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సోలార్ కింగ్ అధినేత షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.....ఈ సందర్భంగా ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవరోధాలు ఉన్న నిరుపేద క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా ముందు ఉంటానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. చిన్నారులు వివిధ విభాగాల్లో తమ నైపుణ్య ప్రదర్శన తనను ఎంతో ఆకట్టుకుందని వారి ఎదుగుదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఒలింపిక్ డే రన్ 2023 టూ కే రన్ కు విచ్చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు న్యాయవాదులకు పోలీస్ అధికారులకు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ నాయకులు రామాంజనేయులు సహకారంతో మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కర్నూల్ కలెక్టరేట్ నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన 2కే రన్ కు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా సహకరించిన పోలీస్ శాఖ కు ట్రాఫిక్ విభాగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎస్పీ రెండో పటాలం డిఎస్పి మహబూబ్బాషా మాట్లాడుతూ వన్ టీవీ న్యూస్ మన తెలుగు టీవీ ఆంధ్ర అక్షర దినపత్రిక సోలార్ కింగ్ అధినేత షేక్ మహబూబ్ బాషా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నేత్రదాన శిబిరాలు మొక్కల పంపిణీలు కరోనా సమయంలో కిట్ల పంపిణీ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి నగదు పురస్కారాలు అందజేయడం ఇదే మొదటిసారి చూస్తున్నానని ఆయన వేనోళ్ళ పొగిడారు. జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ.... క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత షేక్ మహబూబ్ బాషా సహృదయంతో ముందుకు వచ్చి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారని తమ ఒలంపిక్ సంఘము ఆధ్వర్యంలో ఇలాంటి పలు కార్యక్రమాలు నిర్వహించామని మొట్టమొదటిసారి నగదు పురస్కారాలు అందించడం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఉందని క్రీడాకారుల అభివృద్ధికై ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. అనంతరం పలు క్రీడా సంఘాల నాయకులు మాట్లాడుతూ....కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఇలాంటి కార్యక్రమాల్లో ఒలంపిక్ డే రన్ 2023 లో మొట్టమొదటిసారిగా ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత రూ 25 వేల నగదు పురస్కారాలను అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం మొట్టమొదటిసారి అని క్రీడా సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు విద్యార్థుల కేరింతలతో కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకుని ఆలోచింపచేసే విధంగా ఆదర్శంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ, అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ, కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, కె.వి.ఆర్ డిగ్రీ, జూనియర్ కాలేజీ బి క్యాంపు ఇంటర్ కళాశాలల విద్యార్థులు, మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, పలు విభాగాల క్రీడాకారులు జిల్లా ఒలంపిక్ సంఘం నాయకులు న్యాయవాదులు పోలీసులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :