One Tv News - NEWS / విశాఖ జిల్లా : విశాఖ జిల్లాభీమిలి బీచ్ లో ఆదివారం అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సముద్రం లోని అలలతో పాటు చేపలు ఒడ్డుకు కొట్టుకు రావటంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసారు.
సాధారణంగా సముద్రపు చేపలు ఒడ్డుకు రావడం అరుదైన దృశ్యం. అలాంటిది చిన్న చేపలు లక్షల సంఖ్యలో ఒడ్డుకు రావడంతో స్థానికులు వాటిని పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లడంలో పోటీ పడ్డారు. ఇలాంటి దృశ్యాలు తామెప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
One Tv News