One Tv News - NEWS / కర్నూలు జిల్లా : శ్రీశైలం క్షేత్రంలో మరోసారి ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు గతంలో దేవస్థానం చేపట్టిన పలు ఇంజనీరింగ్ పనులలో అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదులు చేయడంతో కర్నూలుకు చెందిన ఏసీబీ సిఐ తమ సిబ్బందితో దేవస్థానం చేసిన పనులను దేవస్థానం అధికారులతో కలిసి క్షేత్రంలో తనిఖీలు నిర్వహించారు మొదటగా ఔటర్ రింగ్ రోడ్డు,ఆలయ మాడ విధులు,ఆలయ పుష్కరిణి పనులను ఏసీబీ అధికారులు స్వయంగా పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు వేసిన రోడ్లను,కొలమానలను అలానే నాణ్యతను పరిశీలించారు
అయితే మరో రెండు రోజులపాటు శ్రీశైలంలోనే ఇంజనీరింగ్ విభాగం చేసిన పనులను పరిశీలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
One Tv News