Sunday, 26 April 2026 04:01:36 PM

దళిత నాయకులు సమావేశం

బద్వేల్

Date : 15 May 2023 09:38 AM Views : 149

One Tv News - NEWS / కడప జిల్లా : కడప జిల్లా బద్వేల్ మండల కేంద్రం లో చర్మకారుల సొసైటీ అధ్యక్షుడు మున్నిల్లి కేశవయ్య. దళిత నాయకులు నారాయణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేశవయ్య మాట్లాడుతూ .గత 20 సంవత్సరముల నుండి అంబేద్కర్ పరస్పర చర్మకారుల సొసైటీ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సొసైటీ కి 1580/B లో 3.64 సెంట్లు స్థలాన్ని కలెక్టర్ ఆదేశాలతో కేటాయించారన్నారు. తాము మాదిగలముఅని స్థలాన్ని కబ్జా చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల నుండి వచ్చి స్థలాన్ని కబ్జా చేయడానికి జనాలు చూస్తున్నారు. కొంతమంది మాదిగ నాయకులు స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో జనాలను రెచ్చగొడుతున్నారు. కొంతమంది కబ్జాదారుల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్మకారులైన తా వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామని తమ సొసైటీ లో 66 మంది సభ్యులు ఉన్నారన్నారు. సొసైటీ సభ్యులందరూ చర్మకారుల కాలనీ లో రేకుల షెడ్లు ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నట్లు పేర్కొన్నారు .

సొసైటీ లో లేని వ్యక్తులు కొంతమంది వచ్చి దౌర్జన్యం చేసి స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో తమపై దాడులు చేస్తున్నారని తెలిపారు . .ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకుడు నారాయణ. తిరుపాలు. నరసింహులు. ప్రజా సంఘాల నాయకులు.చర్మకారుల సొసైటీ సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :