Sunday, 26 April 2026 04:03:55 PM

కలెక్టరేట్ వద్ద ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ధర్నా

విజయనగరం

Date : 27 June 2023 08:13 AM Views : 160

One Tv News - NEWS / విజయనగరం జిల్లా : మెస్ చార్జీల పెంచాలని.. పాఠ్యపుస్తకాలు పంపిణీ వేగవంతంచెయ్యాలనికోరుతూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ధర్నా కు దిగింది. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద "స్పందన" కార్యక్రమం జరుగుతుందని తెలిసీ భారీ ఎత్తున విద్యార్ధినీ విద్యార్థులు కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా తమ నిరసన గళం వినిపించారు. అయితే అదే సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో "స్పందన"...మరో వైపు మేడపైన వీడియో కాన్ఫరెన్స్ హాలులో "జగనన్న న్యాయ భరోసా" కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా భారీ ఎత్తున పోలీసులు మొహరించడం విశేషం.

అవట్ గేట్ వద్ద వన్ టౌన్ ఎస్ఐ లు ఇన్ గేట్ వద్ద రూరల్ ఎస్ఐ లు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇక విద్యార్ధినీలు అధికంగా ఉండటంతో కొత్తవలస ఎస్ఐ దేవీ దిశ ఎస్ఐ ఈశ్వరిలు తమతమ లేడి కానిస్టేబుళ్లతో భారీగానే బందోబస్తు నిర్వహించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :