One Tv News - NEWS / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శివమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ భర్త,కౌన్సీలర్ తూము శరత్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి శివమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి 2.30 గంటల వరకు బోజన కార్యక్రమం వుంటుందని,ఎంత మంది వచ్చినఅందరికి సరిపడా రుచికరమైన భోజనం పెడతామని,రానున్న రోజుల్లో బోధన్ నియోజక వర్గ మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
One Tv News